భారత్ న్యూస్ విజయవాడ…సుచరిత కుటుంబానికి వైసిపి రూ.10 లక్షలు ఆర్థిక సాయం
కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఇంచార్జి కరణం వెంకటేష్
చీరాల : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో జూన్ 21న కామాంధుల చేతిలో అసువులు బాసిన యువతి సుచరిత కుటుంబాన్ని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వైసిపి అధ్యక్షులు మేరుగ నాగార్జున, నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్ బాబులు శనివారం పరామర్శించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు సూచరిత మృతి ఘటన అత్యంత బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని చట్టం కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించటం జరిగిందన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబానికి వైసిపి ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుంది అన్నారు.
