భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..

అవనిగడ్డ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన రోజైన సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పయనంలో ఒక నూతన శకం ప్రారంభమైందని టీడీపీ నాయకులు విక్కుర్తి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను, చంద్రబాబు నాయుడి సమర్థవంతమైన నాయకత్వాన్ని స్మరించుకుంటూ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరావు,తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు,బచ్చు రఘునాథ్ ప్రసాద్,న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ,పులిగడ్డ చంద్ర,అవనిగడ్డ ప్రకాశం,కొల్లూరి ఇమ్మనేయల్, దాసినేని శ్రీనివాసరావు,బండే రాఘవ,లుక్కా పీచ్చాయ్య,బడే సుబ్బారావు,రేపల్లె ఈశ్వరరావు, మొఘల్ మురాద్ బెగ్,లింగం బాబురావు,చెన్ను బాబురావు,కమ్మిలి సుబ్రమణ్యం,నారేపాలెం శివరామకృష్ణ,నాగిడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.