వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ముని రత్నం రెడ్డిని సన్మానించిన శివ యాదవ్

తిరుపతి (భారత్ న్యూస్ )తిరుపతి రూరల్,: తిరుచానూరుకు చెందిన టిడిపి నేత ముని రత్నం రెడ్డికి చంద్రగిరి నియోజక వర్గం నుంచి వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గా రాష్ట్ర కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ సందర్బంగా పలువురు టిడిపి నాయకులు,బిసి సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అందులో భాగంగా మునిరత్నం రెడ్డి కి అత్యంత సన్నిహితుడు ,మిత్రుడు అయిన చిగురువాడ కు చెందిన టిడిపి నాయకులు శివాయాదవ్ శనివారం వారి నివాసంలో కలిసి సన్మానం చేసి,స్వీట్లు,పండ్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని శివ యాదవ్ కోరారు.