భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఈ మధ్య కాలంలో నెట్వర్క్ ప్లాన్ల ధరలు, బెనిఫిట్స్ బాగా మారిపోతున్నాయి.

మన దేశంలో అత్యధికంగా వాడే ఎయిర్టెల్ కూడా తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో చాలా మార్పులు చేసింది. కొన్ని పాత ప్లాన్లను తొలగించి, మరికొన్నింటిలో మార్పులు తీసుకొచ్చింది. ఈ వివరాలన్నీ వినియోగదారులకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది..

▪️మారిన రీఛార్జ్ ధరలు:▪️

ఎయిర్టెల్లో ఒకప్పుడు తక్కువ ధరకు లభించిన అన్లిమిటెడ్ ప్లాన్ రూ.249 ఉండేది. అది రూ.299కి మారి, ఇప్పుడు రూ.349కి చేరింది. తక్కువ బడ్జెట్ లో అన్లిమిటెడ్ కాల్స్, డేటా కోరుకునే వారికి ఇదే ఆరంభ ప్లాన్ గా మారింది. రీఛార్జ్ చేసుకునే ముందు కొత్త ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది…

▪️అధిక డేటా ఇచ్చే ప్యాక్స్▪️

నెలకు సరిపడా డేటా కావాలనుకునే వారి కోసం ఎయిర్టెల్ కొన్ని ప్రత్యేక ప్లాన్ లను తీసుకొచ్చింది.

రూ.399 ప్లాన్ లో రోజువారీ పరిమితి లేకుండా అన్లిమిటెడ్ 4G, 5G డేటా లభిస్తుంది. ఇక రూ.449 ప్లాన్ తో అన్లిమిటెడ్ డేటాతో పాటు ఎక్స్స్ట్రీమ్ ప్లే ద్వారా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు, గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ లాంటి అదనపు ప్రయోజనాలు ఉచితంగా వస్తాయి..

▫️ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్స్:▫️

పదే పదే రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా 84 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.899 ప్లాన్ సాధారణ డేటాతో వస్తే.. రూ.979 ప్లాన్ లో రోజుకు 2GB డేటాతో పాటు అన్లిమిటెడ్ 5G, సోనీ లైవ్ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి.

ఏడాది ప్లాన్ కావాలనుకునే వారికి రూ.3,999 కింద రోజుకు 2.5GB డేటా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితంగా లభిస్తాయి..

‼️రీఛార్జ్ చేసే ముందు గమనించాల్సినవి‼️

ఇవి మాత్రమే కాకుండా..
ఇంట్లో వైఫై కావాలనుకుంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రామ్ ఫైబర్ పేరిట రూ.499 నుండి హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తోంది. అయితే టెలికాం కంపెనీలు ప్లాన్ లను తరచూ మారుస్తుంటాయి..

కాబట్టి.. రీఛార్జ్ చేసే ముందు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం..