భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం : టీడీపీ నేతలు

అవనిగడ్డ, సెప్టెంబర్ 1: పేదలకు పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం అవనిగడ్డలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకొని, కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, డ్వాక్రా సంఘాల బలోపేతం వంటి పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.

ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రభుత్వం తమకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని, జీవనోపాధికి ధైర్యాన్ని అందిస్తోందని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, టీడీపీ నాయకులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విక్కుర్తి రాంబాబు,తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ మండలం అధ్యక్షులు యాసం చిట్టి బాబు,దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,మాచవరపు ఆదినారాయణ,పార్టీ నాయకులు బండే రాఘవ,లుక్కా పిచ్చయ్య,పులిగడ్డ చంద్ర,లుక్కా శ్రీను,బడే సుబ్బారావు,మొఘల్ మురాద్,రాజులపాటి తాండవ తదితరులు పాల్గొన్నారు