భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.రూ. 35 కే కిలో ఉల్లిపాయలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎన్.సి. సి. ఎఫ్. సహకారంతో రాష్ట్రంలో త్వరలో అమ్మకాలు
** ప్రత్యేక కౌంటర్లు రైతు బజార్లలో విక్రయం
** పామ్ ఆయిల్, కందిపప్పు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు
** ధరల స్థిరీకరణ మంత్రుల సబ్ కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
నిత్యావసర ధరల పెరుగుదలను అదుపు చేసే చర్యల్లో భాగంగా మొదటిగా ఉల్లి ధరల తగ్గింపు పై కూటమి ప్రభుత్వం ద్రుష్టి సారించింది. దీనిలో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్. సి. సి ఎఫ్ ) తో అనుసంధానం అయి కేజీ ఉల్లిపాయలు రూ. 35 లకే రాష్ట్ర వినియోగదారులకు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోందని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. నిత్యావసర ధరలపై ప్రభుత్వం నిత్య పర్యవేక్షణ చేస్తోంది అని అన్నారు. ధరల స్థిరీకరణ పై మంత్రుల సబ్ కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. సమావేశం లో మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ అచ్చేంనాయుడు, శ్రీ సత్యకుమార్ లతో కలిసి శ్రీ మనోహర్ గారు వివిధ అంశాలపై చర్చించారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల విషయం, తీసుకోవలసిన చర్యలను మంత్రుల సబ్ కమిటీ చర్చించింది. సమావేశం అనంతరం మీడియాతో శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. ” ఉల్లిపాయల ధరలు బహిరంగ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. రోజువారీ వినియోగించే వంటింటి సరకుల్లో ఉల్లిపాయలు చాలా ముఖ్యం. దీనిపై మంత్రుల కమిటీ చర్చించి, కేంద్ర సహకారాన్ని తీసుకొని కేజీ ఉల్లిపాయలను రూ. 35 కే రాష్ట్ర ప్రజలకు అందించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లు అలాగే ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లిపాయల అమ్మకాలు జరుగుతాయి. విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు దృష్టికి తీసుకోని వెళ్తాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 350 పైగా ప్రత్యేక బియ్యం కౌంటర్లు, రైతు బజార్ల ద్వారా బహిరంగ మార్కెట్ కంటే కేజీ రూ. 10లు తక్కువగా బియ్యం అమ్మకాలు విజయవంతం గా జరుగుతున్నాయి. ఉల్లి ధరల తగ్గింపు వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది.
పామాయిల్, కందిపప్పు ధరలను సమీక్షించాం
సమావేశం లో పామాయిల్, కందిపప్పు ధరల మీద సమీక్షించాం. పామాయిల్ ను కూడా కేంద్రం సహకారం తీసుకొని బహిరంగ మార్కెట్ కంటే రూ 10 రూపాయల తక్కువగా ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పామ్ ఆయిల్ ను బహిరంగ మార్కెట్ లో సరఫరా చేసే వ్యాపారులతో ఒకసారి చర్చించి ప్రజలకు ఈ కీలక సమయంలో తగిన విధంగా ధరలు తగ్గించేందుకు వారితో మాట్లాడతాం. అలాగే చౌక డిపోల్లో కందిపప్పును కూడా ప్రజలకు అందించేందుకు త్వరలోనే కేంద్రంతో మాట్లాడి హామీ తీసుకుంటాం. వచ్చేది పండుగలా సీజన్ కాబట్టి నిత్యవసర ధరలను అదుపులో ఉంచే చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. కేంద్ర సహకారంతో ధరల అదుపులకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది”
