భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.విజయవాడ, సెప్టెంబర్ 3: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం APJAC అమరావతి చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, డివిజన్ కార్యాలయాలు, కలెక్టరేట్ వద్ద గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని APJAC అమరావతి నాయకులు కోరారు.
ఈ కార్యక్రమాల్లో కృష్ణా జిల్లాలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం సంఘటిత పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
అదేవిధంగా, APJAC అమరావతి జిల్లా నాయకులు జిల్లాలోని ఇతర ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులను కలిసి, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారు కూడా ముందుకు రావాలని, ఉద్యోగుల తరఫున
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు
APJAC అమరావతి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో విజయవంతమైన నిరసన కార్యక్రమాలు
ఈ యొక్క కార్యక్రమంలో APJAC అమరావతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీ. నాగేశ్వరరావు, జిల్లా చైర్మన్ ఎం.వి. శ్యామ్ నాథ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. రావు, సిహెచ్. గోపాల్ , గోపి చంద్ తదితర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం APJAC అమరావతి ఆధ్వర్యంలో చేపట్టే తదుపరి కార్యాచరణకు ఉద్యోగులందరూ ఐక్యంగా మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఇట్లు,
APJAC అమరావతి – కృష్ణా జిల్లా కార్యవర్గం
