భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీలో కొత్త పెన్షన్లకు రంగం సిద్ధం

మిగిలిన కేటగిరీల వారికి విడతలుగా పెన్షన్ మంజూరు చేసే అవకాశం

సెప్టెంబర్ 2వ వారం నుండి దరఖాస్తుల స్వీకరణకు అవకాశం.గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలకు త్వరలో లాగిన్

దరఖాస్తుల ఆన్ లైన్ విధానంపై వారం రోజులుగా ప్రయత్నిస్తున్న సెర్ప్ అధికారులు

వితంతువులు, వృద్ధులకు మొదటి ప్రాధాన్యత.సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 1.5లక్షల వితంతు పింఛన్ కు, 1.5లక్షలు వృద్ధాప్య పింఛనుకు అర్హులుగా ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం

అంగ వైకల్యం కోసం సదరం సర్టిఫికెట్ తో పాటు ఇతర అర్హతల నిర్ధారణ పై మల్ల గుల్లాలు

చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తి పరమైన పింఛనుకు సుమారు 60 నుండి 70 వేల అర్హులని అంచనా

స్వీకరించే దరఖాస్తుల పరిశీలన అనంతరం అక్టోబర్ నుండి వితంతు, వృద్ధాప్య పెన్షన్ల మంజూరుకు చాన్స్