భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్.. సెప్టెంబర్ 30 వరకు ఛాన్స్

చిన్న వయసులో ఆధార్‌ తీసుకున్న పిల్లల బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసేందుకు UIDAI ఉచిత అవకాశం కల్పిస్తోంది.

5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్‌ వంటి బయోమెట్రిక్‌ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేయించాలి.

ఈ సేవను SEP 30 వరకు ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత అప్‌డేట్‌ చేయించాలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేసే బాల ఆధార్‌లో సాధారణంగా బయోమెట్రిక్‌ వివరాలు నమోదు చేయరు. కాబట్టి ఐదేళ్లు దాటిన తర్వాత వాటిని అప్‌డేట్‌ చేయడం కీలకం.

15 ఏళ్ల తర్వాత మరోసారి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ అవసరం.