భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..LPG ఈ-కేవైసీ గడువు 23 వరకు పొడిగింపు

A RAJASEKAR.SR Correspondent Vijayawada..ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక అప్డేట్. ఈ-కేవైసీ గడువు ఆగస్టు 16తో ముగియగా ఆయిల్ కంపెనీలు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. లబ్ధిదారులు ఆగస్టు 23 వరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించాయి. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ-కేవైసీ కావడం లేదని డీలర్లు చెబుతున్నారు. దీంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. అటు సర్వర్ ప్రాబ్లమ్ వల్ల ఆన్లైన్లో కేవైసీ ప్రక్రియ కావడం లేదని పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది.