భారత్ న్యూస్ విశాఖపట్నం..నన్ను చంపేస్తా అంటున్నారు.. కాపాడండి.

నన్ను కాపాడండి అంటూ కువైట్ నుంచి వీడియో విడుదల చేసిన కాకినాడ జిల్లా మహిళ

కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది.

నాకు సరిగా తిండిపెట్టడంలేదు, చంపేసేలా ఉన్నారు.. నన్న కాపాడి, పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటి పర్యంతమైంది.

గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారి భర్త మృతితో పిల్లల పోషణ, కుటుంబ భారం తనపై పడడంతో బతుకుతెరువు పిల్లలను తన తల్లికి అప్పగించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పాలకొల్లుకు చెందిన ఎం.సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్లోని జబ్రాలి హమ్మద్ నగరంలో ఒక ఇంట్లో పనికి వెళ్లింది.

కువైట్ వెళ్లిన ఏడు నెలల కాలంలోనే తాను పలు సమస్యలు ఎదుర్కొంటూ, చిత్రహింసలకు గురవుతున్నట్టు వీడియో ద్వారా బాధితురాలు వాపోతోంది.