భారత్ న్యూస్ విజయవాడ…వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు. సీఎం చంద్రబాబు ఆరోపణలు, విమర్శలపై సుదీర్ఘంగా మాట్లాడిన శ్రీ వైయస్ జగన్.
శ్రీ వైయస్ జగన్ ప్రెస్మీట్. ముఖ్యాంశాలు:
అప్పులపై అదే దుష్ప్రచారం:
– బడ్జెట్ పేజీ నెం.14. 16 రెండు పేజీలు చూస్తే.. రాష్ట్ర అప్పులు 2018–19 నాటికి రూ.2.57 లక్షల కోట్లు అని చూపారు. దానికి గవర్నమెంట్ గ్యారెంటీ రూ.55 వేల కోట్లు కూడా కలిపితే అప్పటికి రాష్ట్ర అప్పు మొత్తం రూ.3.13 లక్షల కోట్లు.
– అలాగే 2024లో వైయస్సార్సీపీ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను అదే పేజీలో చూపారు. అప్పులు రూ.4.91 లక్షల కోట్లకు ఎగబాయాయని, గవర్నమెంట్ గ్యారెంటీ అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు, రెండూ కలిపితే మొత్తం అప్పు 6.46 లక్షల కోట్లు అని తేల్చారు.
– అది బడ్జెట్లోనే కాకుండా, 2023–24లో కాగ్ రిపోర్ట్ (పేజీ నెం.18. 20)లో చూపారు.
– అందుకే మరోసారి చంద్రబాబును అడుగుతున్నాను. అయ్యా, అబద్ధాల చెప్పడం ధర్మమేనా? రూ.10 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు.. చివరకు ఎన్నికల నాటికి రూ.14 లక్షల కోట్లు అని చెప్పడం ధర్మమేనా? చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా అదే దుష్ప్రచారం చేస్తూ. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ (వ్యవస్థీకృత నేరం) చేశారు.
అది తప్పైతే అసెంబ్లీలో ఎందుకు పెట్టారు?:
– చంద్రబాబు తన గుండెల మీద చేయి వేసుకుని, ప్రజలకు చెప్పాలి.
అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అధికార యంత్రాంగమంతా ఆయన చేతుల్లోనే ఉంది. తన చేతుల్లో ఉన్న అధికారులతోనే బడ్జెట్ తయారు చేయించి, సభలో ప్రవేశపెట్టారు. అందులోని అధికారిక లెక్కలను కాగ్ కూడా ధృవీకరించింది.
– ఆ తర్వాత కూడా నీ హయాంలో, నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన నీ బడ్జెట్, నీ లెక్కలను కాగ్ ధృవీకరించిన తర్వాత, సభలో పెట్టిన తర్వాత
