భారత్ న్యూస్ విశాఖపట్నం..దివిసీమ లో కాళరాత్రి…!!

అది 1977 నవంబర్ పందొమ్మిది
శనివారం కనీవినీ ఎరుగని ఘోరం
దివిసీమ లో ప్రళయ కాళరాత్రి..
ప్రకృతి వికృత రూపం దాల్చింది..!

జడివానలకు పిడుగుగాలులు తోడై
సముద్రుడు మహా రుద్రుడై
తాడి చెట్టంత పెను తరంగాలతో
తీరప్రాంత లపై విరుచుకు పడి
దారుణ మరణ మృదంగాలు మోగించె..!

జల ప్రళయాన్ని ప్రజలు గుర్తించే లోపుగానే
కడలి రక్కసి మింగేసే పలు గ్రామాలను
చెట్టుకొకరు పుట్టకొకరాయే కుటుంబాలు
పదివేల మంది పైగా మృత్యువాత
బాధితుల శోక సంద్రంలో విగత దేహాలు..?

ఊరులన్నీ మారిపోయే మరుభూమిగా
ఆనవాలు తెలియక నివాసితుల నిర్వేదం
ఆంధ్రావని కార్చే కన్నీరు మున్నీరు
భారత మాత అందించే అభయ హస్తం
ప్రపంచ దేశాలు స్పందించే ఉప్పెన విపత్తుకి..!

జన మండలి యంత్రాంగంతో కదలి వచ్చి
బాధితులను ఓదార్చే ఆత్మీయుడిలా
భూరీగా సహాయం అందించే దీనవాడలకు
బాధితుల పక్షాన మండలి వెంకట కృష్ణారావు
నిలిచే ఆత్మ బంధువుడిలా..!
విపక్షాలు, కళాకారులు, సేవాసంస్థలు కదిలే..!
దీనసీమ అనతి కాలంలోనే మారేపోయే
దివ్యసీమగా…!!

(నవంబర్ 19న దివిసీమ కు ఉప్పెన
ను ప్రజలకు గుర్తు చేస్తూ)