..భారత్ న్యూస్ అమరావతి..శ్రీకాకుళం జిల్లా..
గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు నిరంతర తనిఖీలు చేపట్టాలి.
రోడ్డు ప్రమాదాలను నివారణకు చర్యలు చేపట్టాలి
జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి.,
శ్రీకాకుళం(ఇచ్ఛాపురం )నవంబర్ 20, గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు సరిహద్దు చెక్ పోస్టు, రహదారి మార్గంలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులు ను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు.జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఇచ్చాపురం టౌన్ పోలీసు స్టేషను సందర్శించారు.
