భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…చైనాలో భారీ వరదలు.. వెన్‌జౌలో జలమయం

చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో భారీ వర్షాలతో తీవ్ర వరదలు సంభవించాయి. వెన్‌జౌలోని కాంగ్‌నాన్‌ కౌంటీలో వీధులు నదులను తలపించగా, వాహనాలు, భవనాల దిగువ అంతస్తులు నీటమునిగాయి.

కాంగ్‌నాన్‌లో 24 గంటల్లో 382.5 మి.మీ వర్షపాతం నమోదై స్థానిక రోజువారీ రికార్డును బద్దలు కొట్టింది. ఓ పాఠశాల కూడా వరద నీటిలో చిక్కుకుంది.