భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు: ఆ మూడు విషయాలు మరువకండి!

ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి ఇన్‌స్టా వేదికగా వీడియో విడుదల చేశారు. ప్రధాని వీడియో సందేశం మాటల్లోనే.

‘‘దేశ ప్రజలకు అభినందనలు. 7.8% వృద్ధి గొప్ప విషయం. ప్రజల సంకల్ప బలం, కృషికి ఇది నిదర్శనం. ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ అసాధారణ ఘనతను దక్కించుకుంది. ప్రపంచం యుద్ధంలో మునిగిపోయింది. ఎటుచూసినా యుద్ధ వార్తలే.. సంక్షోభాలే. సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. 2020లో కొవిడ్ తర్వాత నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు. అయినా భారత్‌ పురోగమిస్తోంది’’ ‘‘పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దూరంగా ఉండండి. ‘భారత్‌లోనే వివాహం చేసుకోండి’ అనే మంత్రాన్నే మనం పాటిద్దాం. అవసరం లేకపోతే బంగారాన్ని కొనడం మానుకోండి. స్థానికంగా తయారైన వస్తువులు, సేవలు ఎంత ఎక్కువగా ఎంచుకుంటే.. దేశం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మనం స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటే.. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామనే విశ్వాసం నాకు ఉంది’’ ‘‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతం కంటే ప్రస్తుత వృద్ధి రేటు ఎక్కువ. అమెరికా- ఇరాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితులు, ఇంధన సరఫరాకు అవరోధాలు వంటి పరిస్థితులను తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ రాణించడం విశేషం. ఈ వృద్ధిని దేశ ప్రజలు వేడుకలా నిర్వహించుకోవాలి. అదే సమయంలో వికసిత్ భారత్‌ దిశగా కృషి చేయాలి. 140 కోట్ల మంది ప్రజల ఐక్యత.. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది’’