భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఫ్యూచర్ సిటీలో దేశంలోనే అతిపెద్ద స్టేడియం!
తెలంగాణ ; రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్రీడా రాజధానిగా మార్చే లక్ష్యంతో, ప్రభుత్వం హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో 100 ఎకరాల్లో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది.
డిసెంబర్లో భూమిపూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియం రికార్డును మించేలా సీటింగ్ సామర్థ్యంతో, క్రికెట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, గ్లోబల్ కాన్సర్ట్‌లకు వేదికగా నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించగా, బీసీసీఐ నిర్మాణ, నిర్వహణ ఖర్చులను భరించనుంది…
