భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..వరదలో ఒంటరి చిన్నారి..
కాపాడేవారు లేక.. చూస్తూ వీడియోలు తీస్తున్న జనం!

టిబెట్‌–నేపాల్‌ ప్రాంతంలో వరద ఉధృతిలో ఓ చిన్నారి ప్రాణాల కోసం ఒంటరిగా పోరాడుతున్న దృశ్యం కలచివేస్తోంది.

చుట్టూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరద నీరు..
ఆ చిన్నారి మాత్రం ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలని పోరాడుతున్నాడు.

అంతటి ప్రమాదంలోనూ..
చుట్టూ ఉన్నవారు వీడియోలు తీస్తున్నారు.. కానీ ఆ చిన్నారిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదన్న దృశ్యం మరింత బాధ కలిగిస్తోంది.

మొబైల్ కెమెరా ఆన్ చేయడానికి చేతులు ముందుకొచ్చాయి..
కానీ ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు అదే చేతులు ఎందుకు ముందుకు రాలేదు?

విపత్తు సమయంలో మనిషిలోని మానవత్వమే అసలైన పరీక్ష.

ఒక వీడియో మనకు జ్ఞాపకంగా మిగలొచ్చు..
కానీ ఒక ప్రాణాన్ని కాపాడితే..
అది ఒక జీవితాన్నే నిలబెడుతుంది…