భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్లో అర్హత లేకుండా క్లినిక్లు నిర్వహిస్తున్న 12 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్

Ammiraju Udaya Shankar.sharma News Editor…హైదరాబాద్లో సరైన అర్హతలు లేకుండా క్లినిక్లు నిర్వహిస్తున్న 12 మంది నకిలీ డాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో తనిఖీలు చేసి వీరిని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.
వీరి నుంచి పెద్ద ఎత్తున మందులు, సెలైన్ బాటిళ్లు, సర్జికల్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
