భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఒక తల్లి తన మంగళ సూత్రం కూడా అమ్మేసి ఐ ఫోన్ కొంటాను అంటే మాట వినని ఆ కొడుకు తప్ప..లేకపోతే పెంచిన ఆ తల్లిదండ్రులు తప్ప..🤷
ఏదైనా జరిగింది ఒక విషాద సంఘటన..
ఇలాంటి చిన్న చిన్న పనులకు ఇలా చేయడం ఏంటో.
ఇప్పుడున్న యువత అసలు ఎందుకు మాట వినడంలేదు..
వాళ్ళకి కొద్దిగా అయినా ఆలోచించే తీరు ఎందుకు రావడం లేదు..
పెరిగిన స్వేచ్ఛ.. పాడు చేస్తున్నా స్నేహాలు.. అలవాటు పడుతున్నా చెడు అలవాట్లు..
ఇలా ఒకటి ఏంటి..నేటి యువత ఆలోచిస్తున్న శక్తి తగ్గింది..
మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో కొడుకుతో పాటు తల్లిదండ్రులు లోయలో పడి మృతిచెందిన ఘటనకు సంబంధించిన హృదయవిదారక వీడియో వెలుగులోకి వచ్చింది.
సూసైడ్ పాయింట్ వద్ద ఉన్న కొడుకుని వెనక్కి రమ్మని “నీకోసం మంగళసూత్రం కూడా తీసేస్తా, మీ నాన్నను వదిలేసి నీతోనే ఉంటా, నన్ను వదిలి వెళ్లకు” అని తల్లి కన్నీళ్లతో ప్రాధేయపడింది.
అయినప్పటికీ కొడుకు వినకుపోవడంతో, చివరకు ముగ్గురూ లోయలో పడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
