భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్త మెనూ.. పిల్లలకు మరింత పోషకాహారం! 🍚🥚🌿

చిన్నారుల వయస్సుకు అనుగుణంగా ఆహార మెనూలో మార్పులు చేశారు.

7–12 నెలలు : జూనియర్లుగా విభజించి నెలకు 1.5 కిలోల బాలామృతం
1–3 సంవత్సరాలు: సీనియర్లుగా విభజించి నెలకు 2.5 కిలోల బాలామృతం
3–6 సంవత్సరాలు: వారానికి 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్
సాయంత్రం ఉడికించిన శనగలు
వంటకాల్లో మునగాకు వినియోగానికి ప్రాధాన్యం

పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడటమే లక్ష్యం.

కొత్త మెనూను అంగన్‌వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు సూచించారు. CDPOలు, సూపర్‌వైజర్లు తనిఖీలు నిర్వహించనున్నారు.