భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక
ఈ సీజన్లో తొలిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు (ASR), పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈరోజు, రేపు (ఆగస్టు 22–23) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విశాఖపట్నం నగరం, అనకాపల్లి ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది.
మిగిలిన కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా–విజయవాడ, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
