భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఈడీ సోదాలతో కడప రాజకీయాల్లో కలకలం

కడప: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అదే సమయంలో ఆయన ముఖ్య అనుచరుడిగా పేర్కొనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం.

ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏ కేసు లేదా అంశానికి సంబంధించి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్న దానిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

ఈడీ సోదాల సమాచారం కడప జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.