భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్. ఆగస్ట్19
తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మరో అవకాశం లభించింది. ఇందులో భాగంగా ఎంబీబీఎస్, బీడీఎస్,కోర్సుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాల యం కే ఎన్ ఆర్ యు హెచ్ ఎస్, తిరిగి ప్రారంభించింది.
అభ్యర్థుల విజ్ఞప్తు లను పరిగణనలోకి తీసుకున్న విశ్వవి ద్యాలయం.. అర్హు లైన విద్యార్థులకు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. నీట్ యూజీ,2026లో నిర్ణీత కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థు లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఎంబిబిఎస్, బీడీఎస్,కన్వీనర్ కోటా సీట్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అవసరమైన ధ్రువపత్రాల అప్లోడ్ ప్రక్రియ ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుం ది. అర్హత ఉన్న అభ్యర్థులు గడువు లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికా రులు సూచించారు.
దరఖాస్తు సమయం లో అభ్యర్థులు అవ సరమైన సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉండ దని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే అధికారులు నిర్వహించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దరఖాస్తు పూర్తి చేసి, అప్లికేషన్ సమర్పించిన అభ్య ర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విశ్వవిద్యా లయం తెలిపింది.
