భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాల‌క శాస‌న‌ముల మూడ‌వ స‌వ‌ర‌ణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఈ బిల్లును మంత్రి నారాయ‌ణ ప్రవేశపెట్టారు. స్వ‌ల్ప చ‌ర్చ త‌ర్వాత దీనికి సభ ఆమోదం తెలిపింది. ఆస్తుల ఆటోమ్యుటేష‌న్ అమ‌ల్లోకి వ‌చ్చేలా చ‌ట్టంలో పలు సవరణలు చేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆస్తుల రిజిస్ట్రేష‌న్ త‌ర్వాత య‌జ‌మాని పేరు మున్సిపాల్టీల్లో న‌మోదుకు విడిగా మ్యుటేష‌న్ చేస్తున్నారని, ఇక‌పై రిజిస్ట్రేష‌న్ జ‌రిగే స‌మ‌యంలోనే మున్సిప‌ల్ రికార్డ్స్‌‌లో కూడా పేరు మారేలా చట్టంలో మార్పులు చేశారు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే మ్యుటేష‌న్ ఫీజూ చెల్లించేలా స‌వ‌ర‌ణ‌లు చేశారు. కార్పొరేష‌న్లు, గ్రేడ్ల వారీ మున్సిపాల్టీల్లో మ్యుటేష‌న్‌కు ఏకీకృత ఫీజులు అమ‌లు జరిగేలా సవరణలు చేశారు.

శాసనసభ ప్యానల్‌ ‌స్పీకర్లు వీరే..

శాసనసభలో ప్యానల్‌ ‌స్పీకర్లుగా ఎంపిక చేసిన వివరాలను సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు…