భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…శర్వానంద్-శ్రీను వైట్ల ‘జార్జ్ క్రిష్’ సంక్రాంతికి సిద్ధం…

శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘జార్జ్ క్రిష్’ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ గతంలో సంక్రాంతికి ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలతో విజయాలు అందుకున్నారు..