భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంతకల్లు కసాపురంలో విద్యుత్ ఘాతం

  • పొలంలో రైతు దుర్మరణం
  • విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో విద్యుత్ ఘాతంతో రైతు బోయ ఆంజనేయులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది.

గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు ఉదయం తన పొలంలో కంది సేద్యం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో తెగిపడి ఉన్న విద్యుత్ వైరు ఆయన ఎద్దుపై పడింది. ఎద్దును కాపాడేందుకు వెళ్లిన ఆంజనేయులు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే తమ వాడు బలయ్యాడని ఆరోపించారు. పొలాల వద్ద తెగిపడి ఉన్న వైర్లను సరిచేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.