భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నకిలీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో మహిళను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్

క్రైమ్ న్యూస్ కృష్ణా :
ఉయ్యూరులో స్థానికంగా నివసించే పైలా జీవనజ్యోతి (28) అనే మహిళ బ్యూటిషిషన్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది, అలానే తాను చేసే బ్యూటీషియన్ సర్వీసులను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉండేది
అలా ప్రచారం చేయడం ద్వారా ఆదరణ పెరగటం, బాగా పేరు రావడం జరిగింది, ఒక మహిళ ఆ విధంగా తన కాళ్ళ మీద తాను నిలబడటం, మంచి సంపాదన కలిగి ఉండటం భరించలేని స్థానికుడైన ఫోటోగ్రాఫర్ గా పనిచేసే దాసరి రామకృష్ణ (32) బాధితురాలి పేరు మీద నకిలీ ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ఓపెన్ చేసి బయటికి చెప్పలేని విధంగా అసభ్యకరమైన, సభ్య సమాజం తలదించుకునే మాటలతో మెసేజ్లు పంపడం బాధితురాలు ఫోన్ నెంబరు సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం చేశాడు
ఈరోజు ఫిర్యాదు అందుకున్న ఉయ్యూరు టౌన్ పోలీసులు వెంటనే ఆ నకిలీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కు సంబంధించిన సాంకేతిక ఆధారాలను అనాలసిస్ చేయడం ద్వారా ముద్దాయిని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది
మహిళల పట్ల, చిన్నారుల పట్ల జరిగే నేరాలు విషయంలో చాలా కఠినంగా ఉండాలని కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా సైబర్ క్రైమ్ టీం , ఉయ్యూరు సిఐ టివివి రామారావు వేగంగా స్పందించి ముద్దాయిని అరెస్టు చేయడం జరిగింది.