పోలీస్ స్టేషన్,పాకాల జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జడ్జి పి.పూర్ణిమ దేవి….
( భారత్ డిజిటల్ న్యూస్ ) 11/08/2026 తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో పాకాల మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్,పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి.పూర్ణిమ దేవి ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సమక్షంలో మంగళవారం మొక్కలను నాటారు.వర్షాకాల మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా పాకాల పోలీస్ స్టేషన్ ఆవరణలో సీ.ఐ టి.చిన్న గోవిందు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.వర్షాకాలంలో నిర్వహించే భారీవృక్షారోపణ కార్యక్రమాన్నే రుతుపవన మొక్కల పెంపకం కార్యక్రమం అని,ఈ కాలంలో నేలలో అధిక తేమ,వెచ్చని ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల మొక్కలు వేగంగా పెరిగి,మనుగడ సాగించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు.పాకాల జూనియర్ సివిల్ కోర్టు,పాకాల పోలీస్ స్టేషన్ ఆవరణలో కలిపి 150 మొక్కలు నాటామని తెలిపారు.పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.కార్యక్రమంలో కోర్టు సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

