.భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల విడుదల
తిరుమల: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను విడుదల చేశారు. తిరుమల (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ 2025 ఫిబ్రవరి నెల కోటాను గురువారం తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది..
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తితిదే (TTD News) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబరు 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
శ్రీవాణి ట్రస్టు టికెట్లను నవంబర్ 23 ఉదయం 11 గంటలకు తితిదే (TTD) విడుదల చేయనుంది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 25న ఉదయం 10 గంటలకు తితిదే (TTD News) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబరు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసకోవచ్చు..
