భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఎన్.టి.ఆర్ జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ కానిస్టేబుల్ కు , సచివాలయ మహిళా పోలీస్ వారికి డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.ఆపరేటింగ్ పై శిక్షణా కార్యక్రమం ను కమాండ్ కంట్రోల్ నందు ప్రారంభించడం జరిగింది. మహిళ కానిస్టేబుల్స్ 38 మందికి , సచివాలయ మహిళా పోలీస్ 38 మందికి మొత్తం 76 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ శ్రీ గౌతమీ శాలి ఐ.పి.ఎస్., గారు,క్రైమ్ డీసీపీ డా II తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్., గారు పాల్గొన్నారు.
