..భారత్ న్యూస్ అమరావతి..టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వానం.
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు అందించి ఆహ్వానించారు.
ఈ మేరకు ఆహ్వాన పత్రికను తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో శనివారం అందించారు.
శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు వివరించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి ఛైర్మన్ సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
