..భారత్ న్యూస్ అమరావతి..ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవం బర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.
2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదు వుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనా లకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.
విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞాన భూమి వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
విద్యార్థులకు ఏవైనా సందే హాలు ఉంటే సంబంధిత కళాశాలలో, స్థానిక సచివాలయంలో లేదా సంక్షేమ శాఖల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
కొత్త రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ చేయడానికి https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్ కళాశాల లాగిన్ లో పొందుపరచాలని తెలిపారు.
