ఏలూరు జిల్లా ముదినేపల్లి::::( భారత్ న్యూస్) 14\11\2024:::: పొలం పిలుస్తోంది కార్యక్రమం:::::
ఈరోజు ముదినేపల్లి మండలంలోని కొర్రగుంటపాలెం మరియు పెదగున్నూరు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బలగాని వేణుమాధవ్ మాట్లాడుతూ ఎరువులను భూసార పరీక్ష ఫలితాలకు అనుగుణంగా నిర్దేశిత మోతాదులోనే వాడాలని తెలియజేశారు. రాబోయే రబీ కాలంలో వేయబోయే మినిముకు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి రసం పీల్చు పురుగుల నుంచి రక్షణ పొందాలని సూచించారు. విత్తన శుద్ధికి ఇమిడా క్లోప్రేడ్ మందును రెండు మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి బాగా పట్టించి నీడలో ఆరబెట్టుకుని విత్తనాన్ని విత్తుకోవాలని సూచించారు. రాబోయే రబీ కాలంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీ.ఏం.ఎఫ్.బి.ఐ.) కింద రైతులందరూ తమకు సమీపంలోని మీసేవ కేంద్రంలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి పొందవలసిందిగా కోరారు. వరికి ఎకరానికి రూ 500/- మినుము పంటకు ఎకరానికి రూ 60/- చొప్పున ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయ మండల ఇన్చార్జి శ్రీ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ విత్తన శుద్ధికి అవసరమైన బీజామృతం తయారీ విధానాన్ని రైతులకు తెలియజేశారు అనంతరం జరిగిన ఫీల్డ్ డెమో స్టేషన్ లో బీజామృతం తయారీ విధానాన్ని రైతులకు చూపించడం జరిగింది. రైతులకు భూసార పరీక్ష కార్డులను సమావేశం అనంతరం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.