..భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నెదర్లాండ్స్ దేశ రాయబారి మరిసా జెరార్డ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని సీఎం గారి అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ గారు కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల పట్ల నెదర్లాండ్స్ రాయబారి గారు ఆసక్తి కనబర్చారు.
