భారత్ న్యూస్ విజయవాడ…భారత ప్రధాన న్యాయమూర్తి-CJI గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తదితర ప్రముఖుల సమక్షంలో జస్టిస్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.