..భారత్ న్యూస్ హైదరాబాద్….అపరిశుభ్రంగా చార్మినార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం

హైదరాబాద్ – మొఘలురా ఇండోర్ స్టేడియంలోని చార్మినార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడికొచ్చి వారు ఇష్టానుసారంగా తెల్లటి గోడలపై పాన్లు తిని ఉమ్మేస్తున్నారు. దీంతో గోడలన్నీ వికారంగా కనిపిస్తున్నాయి.

సిబంది, అధికారులతో పాటు అక్కడ వివిధ పనుల కోసం వచ్చే వారి సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు మూత్రశాలలు కూడా కంపు కొడుతున్నాయి. కేవలం పేరుకే మరుగుదొడ్లు తప్పిస్తే ఎలాంటి నీటి సౌకర్యం లేదు. దీంతో సామగ్రి ధ్వంసమైంది.

నెలల తరబడి నీరు లేకపోవడంతో చార్మినార్ డీఎంసీ కార్యాలయానికి వెళుతుంటే దుర్వసన వస్తోంది. కొన్నిసార్లు కార్యాలయానికి వివిధ పనులనిమిత్తం వచ్చే వారు మలమూత్రాలకు వెళ్లలేక పొట్ట బిగపట్టుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఉన్నత అధికారులు స్పందించి మరుగుదొడ్లు, మూత్రశాలను వినియోగంలోకి తీసుకుని రావాలని ప్రజలు కోరుతున్నారు…