.భారత్ న్యూస్ అమరావతి..విశాఖ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరి పిల్లలకు స్కూల్‌ ఫీజులో 50శాతం రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హ‌రేంధిర ప్ర‌సాద్
కు ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.

సోమవారం ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌, ఏపీ బ్రాడ్‌కాస్టి జర్నలిస్టుల అసోసియేషన్‌, ఏపీ స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టర్‌ హ‌రేంధిర ప్ర‌సాద్ ను కలిసి స్కూల్‌ ఫీజు రాయితీ విషయమై వినతి పత్రం సమర్పించారు.

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్భన్‌ అధ్యక్షుడు పి నారాయణ్‌లు ఇందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు.

తాజాగా తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడ జర్నలిస్టుల ఫిల్లలకు ఫీజు రాయితీ కల్పించిన విషయాన్ని వివరిస్తూ, అందుకు సంబంధిచిన ఉత్తర్వులను అందజేశారు.

2016 నుంచి విశాఖ ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టులకు ఫీజు రాయితీ కల్పించిన ఉత్తర్వులను కూడా కలెక్టర్‌కు సమర్పించారు.

వాటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. విశాఖ జిల్లాలో కూడా జర్నలిస్టుల ఫిల్లలకు స్కూల్‌ పీజు రాయితీ క