భారత్ న్యూస్ విజయవాడ…2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 11,855 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.
‘సూపర్ సిక్స్’ హామీలలో భాగంగా మా ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ – ప్రధానమంత్రి కిసాన్ పథకం’ ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. మా ప్రభుత్వం రైతుల సమగ్ర అభివృద్ధికి పొలం పిలుస్తోంది, వడ్డీ లేని రుణాలు, భూసార కార్డుల పంపిణీ, వ్యవసాయ పనిముట్ల సరఫరా, భూసార పరీక్షల ప్రయోగశాలలు, పొలంబడి వంటి పథకాలను అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రబీ కాలం నుండి పంటల బీమా పథకాన్ని సవరించడం మరియు స్వచ్ఛంద నమోదు నమూనాను అవలంబించడం వలన, రైతులు వారి వారి వ్యక్తిగత అవసరాల ఆధారంగా ఈ పథకాలలో పాల్గొనే స్వేచ్ఛను మరియు వెసులుబాటును కల్పించడం జరిగింది…
