భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

రాజన్న జిల్లా:ఆగస్టు 29.
కొత్త కొండ వీరభద్ర స్వామి వారి నక్షత్రమాల ధరించిన అనంతరం వేములవాడలోని భీమేశ్వర స్వామి, వారిని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దర్శించుకున్నారు.

శనివారం భీమేశ్వర ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తెలంగాణలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని వారు స్వామివారిని కోరినట్లు వారు తెలిపారు.