…భారత్ న్యూస్ హైదరాబాద్…..బ్రేకింగ్.

ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ

22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసిన‌ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ

స్వయం సహాయక సంఘాల‌ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్ లు

ఇందిరా మహిళా శక్తి భవన్ ల‌లో శిక్షణా కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్, కామన్ వర్క్ షెడ్, ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, SARAS మేళాలు, జీవనోపాధి, ఆర్థిక కార్యకలాపాల నిర్వ‌హ‌ణ‌

22 జిల్లా కేంద్రాల్లో 22 మ‌హిళా శ‌క్తి భ‌వ‌నాలు

ఒక్కో భ‌వ‌న నిర్మాణానికి రూ. 5 కోట్లు

మొత్తం రూ.110 కోట్ల అంచనా వ్యయంతో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్‌ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు

నవంబర్ 19 న హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో జరిగే ప్రజా పాలన విజయోత్సవ స‌భ‌లో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాల‌కు శంకు స్థాప‌న‌