.భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న “ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే” నేపథ్యంలో మిస్డ్ కాల్ నెంబర్…Missed Call Number – 72890 87272* ని ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ..

ఇప్పటికే సుమారుగా 15 వేల మందితో కోఆర్డినేట్ చేస్తూ – సర్వే ప్రాముఖ్యతను మరియు సందేహాలను నివృత్తి చేయడం జరిగింది..

“ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే” మిస్డ్ కాల్ నెంబర్ పోస్టర్ ని ఆవిష్కరించిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.

ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే” పై నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి సందేహాలు ఉన్నా, నివృత్తి చేసుకోవడానికి ఈ మిస్డ్ కాల్ నెంబర్ ని ఏర్పాటు చేసాం అని దిశానిర్దేశం చేసిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.

రుద్ర సంతోష్ పర్యవేక్షణలో, “కనెక్ట్ సెంటర్” టీమ్ తో ఇకపై ప్రతి రోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ నుండి రోజుకు 2000 మందికి పైగా సందేహాలను నివృత్తి చేస్తూ సేవలు అందించేలా ఏర్పాట్లు

రాబోయే 15రోజుల్లో సుమారుగా 30వేల కార్యకర్తలతో* నేరుగా అనుసంధానం చేసేలా ప్రణాళిక