భారత్ న్యూస్ హైదరాబాద్….న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియజేశాయి.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య గారు, ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వి.కృష్ణమోహన్ రావు గారు బీసీ సంఘాలకు చెందిన ఇతర నేతలు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్.కృష్ణయ్య గారు, బీసీ సంఘం నేతలు సీఎం గారితో అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ఆ ప్రక్రియలోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పునరుద్ఘాటించారు…