..భారత్ న్యూస్ హైదరాబాద్….ఎన్నికల ముందు కౌలు రైతుల ప్రేమ ఒలకబోసి ఇప్పుడు మొండి హస్తం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కౌలు రైతులకు రూ.12 వేలు రైతు భరోసా దేవుడు ఎరుగు.. వడ్లు అమ్మలంటే ముప్పు తిప్పలు పెడుతున్న అధికారులు

కౌలు రైతు వడ్లు అమ్మాలంటే మండల వ్యవసాయ అధికారి చుట్టూ తిరగాల్సిందే

వడ్లు కొనేందుకు సరికొత్త విధానాలు

కౌలు రైతులు వడ్లు ఆమ్మాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి.. 50 క్వింటాళ్ల లోపు వడ్లు పండిస్తే వ్యవసాయ అధికారి దగ్గర, 50 క్వింటాళ్ల కంటే ఎక్కువ పండిస్తే మండల వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గర గుర్తింపు పత్రం తీసుకోవాలి.

వడ్లు కొన్న రెండు రోజుల్లో డబ్బులు ఖాతాల్లో పడాల్సి ఉన్నా పడడం లేదు.

కేంద్రాల నిర్వాహకులు వడ్లు కొన్న వివరాలు ట్యాబ్ లల్లో నమోదు చేయడం లేదు.

వడ్లు తడవకుండా టార్పాలిన్ కవర్లు, లారీలు సరిపడ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.