భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఓల్డ్ ఈజ్ గోల్డ్..
మరో కవర్ సాంగ్ తో మీ ముందుకు కొరియో గ్రాఫర్ రాజు మాస్టర్ –
ఎన్టీఆర్ సూపర్ హిట్ సాంగ్ రీమేక్
“ఓల్డ్ ఈజ్ గోల్డ్” పాతవి ఎప్పుడూ అమూల్యమైనవి, ఉత్తమమైనవి.. ఈ మాటను ముఖ్యంగా పాతకాలపు మధురమైన పాటలు, అనుభవాలు, విలువలు మరియు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి ఉపయోగిస్తారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అద్భుతమైన పాటల్లో నటించారు. వాటిలో కొన్ని పేరెన్నికగన్నవి. ఆయన నటించిన చిత్రం నుంచి ఒక గొప్ప ఊర మాస్ సాంగ్ ఒకటి రీమిక్ చేస్తూ కవర్ సాంగ్ షూటింగ్ పూర్తి చేశారు ప్రముఖ సినీ బుల్లితెర కొరియోగ్రాఫర్ కోనేటి రాజు మాస్టర్. షాద్ నగర్ జర్నలిస్ట్ కేపీతో కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ కవర్ సాంగ్ మంచి పేరు తెస్తుందని పాతతరం పాటను కొత్తగా చిత్రీకరించి అందమైన లోకేషన్లలో స్టూడియోలో షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు కొనేటి రాజు మాస్టర్ తెలిపారు. తను నృత్య దర్శకత్వం వహిస్తుండగా డీఓపి శ్రావణ్ వ్యవహరించారు. ఈ పాటకు సీనియర్ జర్నలిస్టు కేపీ, నటించగా ఆయనకు తోడుగా నూతన వర్ధమాన నటి మిన్ను మొదటి సారి నటించారు. మేకప్ ప్రణతి, మౌనిక. శంషాబాద్ సమీపంలోని శ్రావణ్ స్టూడియోస్ లో నిర్మించిన ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాట వచ్చేవారం విడుదల చేస్తున్నట్లు కొన్నిటి రాజు మాస్టర్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే అనేక పాటలు రీమిక్స్ చేయడం జరిగిందని వాటిని ప్రేక్షకులకు విడుదల చేసిన అనంతరం ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చిందని తిరిగి మళ్లీ ఈ పాటను తన కాంబినేషన్లో జర్నలిస్ట్ కేపీ చేయడం శేషమని రాజు మాస్టర్ తెలిపారు.

