భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కార్పొరేట్​కు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వహిస్తాం: సీఎం రేవంత్

Ammiraju Udaya Shankar.sharma News Editor…T.G : కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

టిమ్స్‌కు వచ్చే రోగులకు ఆహారం, ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు.

రోగులతో పాటు వచ్చే బంధువులకు ఆహారం, వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్జరీలు చేసే డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇస్తామని సీఎం తెలిపారు. పేదలకు విశ్వాసం కలిగిస్తే మన జన్మ సార్థకం అయినట్లేనని ఆయన అన్నారు.

విద్యార్థులకు ఉచిత విద్య, సాంకేతిక నైపుణ్యం అందిస్తే వాళ్లే బతుకుతారని అభిప్రాయపడ్డారు.