భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన జార్ఖండ్‌ సర్కార్‌..!

వారాల తరబడి విద్యార్థుల నిరసనలు…
16 రోజుల పాటు నిరాహార దీక్ష…
దీంతో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

JSSC-CGL పరీక్షతో పాటు…
TDPL నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేసింది.

అంతేకాదు…
ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు, ఎంపికలను కూడా రద్దు చేసింది.

విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్‌ మహతో
తన నిరాహార దీక్షను విరమించారు.

అయితే…
ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండే వరకు
పోరాటం కొనసాగుతుందని మహతో స్పష్టం చేశారు.

ఇక…
పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై
ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

మరి…
ఈ దర్యాప్తులో అసలు అవకతవకలు ఏంటి?
బాధ్యులు ఎవరు? అనేది తేల్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.