భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..॥ శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🪷🙏🪷🦢🦚
ద్రాఘీయాన్ నీలకేశీ చ
జాగ్రదంబుజ లోచనః।
ఘృణావాన్ ఘృణిసమ్మోహో
మహాకాలాగ్ని దీధితిః॥

అర్థం:

ద్రాఘీయాన్
చాలా పొడవైన, ఎత్తైన స్వరూపం కలవాడు. ఆజానుబాహుడు

నీలకేశీ చ
నల్లని, మేఘం లాంటి కేశాలు కలవాడు

జాగ్రదంబుజ లోచనః
వికసించిన కమలం లాంటి మేలుకుని ఉన్న కన్నులు కలవాడు. ఎప్పుడూ భక్తులను గమనిస్తూ ఉండేవాడు

ఘృణావాన్
భక్తులు యందు, దయ, కరుణ, జాలి ఎక్కువ కలవాడు

ఘృణిసమ్మోహః
తన కరుణతోనే అందరినీ మోహింపజేసేవాడు

మహాకాలాగ్ని దీధితిః
ప్రళయకాలంలో మహాకాలాగ్ని లాంటి “తేజస్సు”తో అధర్మాన్ని కాల్చేవాడు

విశేషం:

వేంకటేశ్వరుడు సౌమ్యుడు మరియు రౌద్రుడు. భక్తులకు కరుణామయుడు

స్వామివారి కన్నులు ఎప్పుడూ మూతపడవు అందుకే తిరుమలలో ఎప్పుడూ భక్తున్ని చూస్తూనే ఉంటాడు.

శనివారం తులసి దళాలతో పూజ చేసి, నువ్వుల నూనెతో దీపం పెట్టి, “ఓం నమో వేంకటేశాయ” అని జపిస్తే, శనిదోషం తొలగి ఐశ్వర్యం వస్తుంది.