చెత్త నిర్వహణ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించండి..

కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి ( భారత్ న్యూస్ ) తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్త ను నిర్వహణ కోసం తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. తూకివాకం వద్ద ఉన్న తడి, పొడి చెత్త నిర్వహణ, హోటల్స్ వేస్ట్ తో గ్యాస్ తయారీ కేంద్రం, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల నిర్వహణపై బుధవారం సంబంధిత అధికారులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటి వద్ద నుండి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని అన్నారు. తద్వారా చెత్త నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు. తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్ల ను సమర్థవంతంగా వినియోగించాలని అన్నారు. అన్ని ప్లాంట్లు 100 శాతం నిర్వహణలో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ముఖ్యంగా నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించి నిర్వహణ చేయాలని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ లో సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు..మురుగునీటి.శుద్ధి కేంద్రం నీటి సాంద్రతను తిరుపతి ఐఐటి వారితే పరీక్షలు చేయించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య , సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.సి.పి. మాహాపాత్ర, డి. ఈ లు, ఏ.సి.పి.లు, శానిటరీ సూపర్ వైజార్లు, తదితరులు అన్నారు.