గంగిరెడ్డిపల్లి స్వయం సహాయక మహిళా భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం
చంద్రగిరి ( భారత్ న్యూస్ ) రామచంద్రాపురం సర్వేంద్రియం నయనం ప్రధానం,అనగా అన్ని ఇంద్రియాలలో కంటే కంటి చూపు ప్రధానమైనదని వెంకటేష్ ఆర్ఎంపి డాక్టర్ అన్నారు. తిరుపతిలోని అమెరికన్ లేజర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం మండలంలోని గంగిరెడ్డిపల్లి స్వయం సహాయక మహిళా భవనంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో దూరపు చూపు,దగ్గర చూపు, చెత్వారం,మసక,శుక్లాం వంటి పలు కంటికి సంబంధించిన వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు.మందులు ఉచితంగా అందించారు.కంటి అద్దాలు అవసరమైన వారికి 800 రూపాయలకే ఇవ్వనున్నట్లు తెలిపారు. కంటి ఆపరేషన్లు చేసుకోవాల్సిన వారికి ఆరోగ్యశ్రీ పథకం ఉచితంగా చేయనున్నామన్నారు.ఆపరేషన్లు అవసరమైన వారు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డులను తీసుకురావాలని సూచించారు. వైద్య శిబిరంలో గంగిరెడ్డిపల్లి కమ్మ కండ్రిగ, ఎస్టీ కాలనీ,గెరికిచేను పల్లి,గొల్లపల్లి మిట్టూరు తదిర గమాల నుంచి 300 పైగా వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.ఈ వైద్య శిబిరాన్ని కె.కేశవ,జె.రాజేష్ ల ఆధ్వర్యంలో నిర్వహింపబడింది.
